Ophrah గురించి బైబిల్ వచనాలు: 2. A city in Manasseh, home of Gideon
2. A city in Manasseh, home of Gideon గురించి వచనాలు
యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు.
కాబట్టి గిద్యోను అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దానికి యెహావా సమాధానకర్త అని పేరు పెట్టాడు. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
గిద్యోను ఆ బంగారాన్ని ఏఫోదులా చేసి దానిని తన సొంత పట్టణమైన ఒఫ్రాలో ఉంచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరు అక్కడికి వెళ్లి దానికి మొక్కి వ్యభిచారం చేశారు. అది గిద్యోనుకు అతని కుటుంబానికి ఉచ్చుగా మారింది.
యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు, అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న తన తండ్రి యోవాషు సమాధిలో అతడు పాతిపెట్టబడ్డాడు.
అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లి, తన అన్నదమ్ములైన డెబ్బైమంది యెరుబ్-బయలు కుమారులను ఒకే బండ మీద చంపాడు. అయితే యెరుబ్-బయలు చిన్న కుమారుడైన యోతాము తప్పించుకుని దాక్కున్నాడు.