Offences Against the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Blasphemy against him, unpardonable
Blasphemy against him, unpardonable గురించి వచనాలు
అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను.
మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ ఉండదు.
తన సహోదరుడు గాని సహోదరి గాని మరణానికి గురి చేయని పాపం చేయడం మీరు చూస్తే, మీరు తప్పక ప్రార్థించాలి. అప్పుడు దేవుడు వారికి జీవం ఇస్తారు. మరణానికి నడిపించే పాపం ఉంది. మీరు దాని గురించి ప్రార్థించాలని నేను చెప్పడం లేదు.