Skip to content

Meditation గురించి బైబిల్ వచనాలు

42 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను.

  2. మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను.

  3. పాలకులు కలిసి కూర్చుని నన్ను అపవాదు చేసినప్పటికీ, మీ సేవకుడు మీ శాసనాలను ధ్యానిస్తాడు.

  4. నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను, తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను.

  5. యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి రాత్రివేళ మీ పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను.

  6. నేను నా మార్గాలను గమనించి నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను.

  7. కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక; కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను.

  8. ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో! నేను రోజంతా దానిని ధ్యానిస్తాను.

  9. మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి.

  10. నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను.

  11. మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా, రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి.

  12. దేవా, మీ ఆలోచనలు నాకెంతో అమూల్యమైనవి! వాటి మొత్తం ఎంత విస్తారమైనది!

  13. వాటిని లెక్కించడానికి నేను ప్రయత్నిస్తే, అవి ఇసుకరేణువుల కంటే లెక్కకు మించినవి, నేను మేల్కొనినప్పుడు నేను ఇంకా మీ దగ్గరే ఉన్నాను.

  14. వెనుకటి రోజులు జ్ఞాపకము చేసుకుంటున్నాను; మీ క్రియలను గురించి ధ్యానిస్తున్నాను, మీ చేతిపనిని గురించి ఆలోచిస్తాను.

  15. నేను అక్కడికి వచ్చేవరకు నీవు సంఘంలో పరిశుద్ధ వాక్యాన్ని బిగ్గరగా చదువుతూ, హెచ్చరిస్తూ, బోధించడం మానకుండ జాగ్రత్తగా చూసుకో.

  16. సంఘపెద్దలు తమ చేతులను నీపై ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు అనుగ్రహించబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు.

  17. ఈ విషయాల్లో నీవు జాగ్రత్తగా ఉండు; నీ అభివృద్ధి అందరికి స్పష్టంగా కనబడేలా నీవు వాటిని పూర్తిగా ఆచరించు.