Skip to content

Kidnapping గురించి బైబిల్ వచనాలు: Instance of

4 వచనాలు · 2 కోణాలు

Instance of గురించి వచనాలు

  1. అప్పుడు వారు బెన్యామీనీయులను ఇలా ఆదేశించారు: “అక్కడికి వెళ్లి ద్రాక్షతోటల్లో దాక్కుని

  2. వేచి ఉండండి. షిలోహు నుండి యువతులు నాట్యంలో పాల్గొనడానికి వస్తున్నప్పుడు, మీరు ద్రాక్షతోటల్లో నుండి త్వరగా వచ్చి, ప్రతివాడును షిలోహు యువతులలో ఒక యువతిని పెళ్ళి చేసుకోడానికి తీసుకెళ్లండి. తర్వాత బెన్యామీను ప్రదేశానికి తిరిగి వెళ్లండి.

  3. వారి తండ్రులు గాని సోదరులు గాని మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో, ‘యుద్ధ సమయంలో వారికి మేము భార్యలను తీసుకురాలేదు, కాబట్టి మీరు మా పట్ల దయచూపి వారికి సహాయం చెయ్యండి. మీ అంతట మీరు మీ కుమార్తెలను వారికివ్వలేదు, కాబట్టి మీరు ప్రమాణం విషయంలో అపరాధులు కారు’ అని చెప్తాము.”

  4. కాబట్టి బెన్యామీనీయులు అలాగే చేశారు. యువతులు నాట్యం చేస్తూ ఉంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క యువతిని పట్టుకుని తనకు భార్యగా చేసుకున్నాడు. తర్వాత వారు తమ వారసత్వ భూమికి తిరిగివెళ్లి పట్టణాలను మళ్ళీ కట్టి వాటిలో స్థిరపడ్డారు.