Skip to content

Heredity గురించి బైబిల్ వచనాలు

12 వచనాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను.

  2. అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను.

  3. నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను చంపేశావు కాబట్టి నీవు సమాధిలో వారితో పాటు కలిసి ఉండవు. దుర్మార్గుని సంతానం ఎప్పుడూ జ్ఞాపకానికి రాదు.

  4. వారు పెరిగి భూమిని స్వాధీనం చేసుకుని తమ పట్టణాలతో భూమిని నింపకుండా తమ పూర్వికుల పాపాన్ని బట్టి అతని పిల్లలను వధించడానికి చోటు సిద్ధం చేయండి.

  5. “చూడండి, ఇది నా ఎదుట గ్రంథంలో వ్రాయబడింది: నేను మౌనంగా ఉండను, వారికి పూర్తి ప్రతిఫలం చెల్లిస్తాను; మీ పాపాలకు మీ పూర్వికుల పాపాలకు, నేను వారికి వారి ఒడిలో ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా అంటున్నారు. “ఎందుకంటే, వారు పర్వతాలమీద ధూపం వేశారు, కొండలమీద నన్ను అవమానించారు, గతంలో వారు చేసిన వాటన్నిటికి వారి ఒడిలోనే పూర్ణ ప్రతీకారాన్ని కొలిచి పోస్తాను.”

  6. Your iniquities, and the iniquities of your fathers together, saith the LORD, which have burned incense upon the mountains, and blasphemed me upon the hills: therefore will I measure their former work into their bosom.

  7. “ఆ రోజుల్లో ప్రజలు, “ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తిన్నప్పుడు, పిల్లల పళ్లు పులిసాయి’ అనే సామెత చెప్పరు.

  8. ఎవరి పాపానికి వారే చస్తారు; ఎవరు పుల్లని ద్రాక్షలు తింటారో వారి పళ్లే పులుస్తాయి.

  9. “అయితే మీరు, ‘తన తండ్రి దోషశిక్షను కుమారుడు ఎందుకు భరించడు?’ అని అడుగుతున్నారు. కుమారుడు నీతిన్యాయాలను జరిగిస్తూ నా శాసనాలను అనుసరించి నా నిబంధనలను పాటించాడు. కాబట్టి అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు.

  10. పాపం చేసేవాడు చనిపోతాడు. తల్లిదండ్రుల పాపాన్ని పిల్లలు భరించరు. పిల్లల పాపాన్ని తల్లిదండ్రులు భరించరు. నీతిమంతుని నీతి వానికే చెందుతుంది. అలాగే దుర్మార్గుని దుర్మార్గం వానికే చెందుతుంది.

  11. శరీరం నుండి జన్మించేది శరీరం, ఆత్మ నుండి జన్మించేది ఆత్మ.

  12. ‘నీవు తిరిగి జన్మించాలి’ అని నేను చెప్పినందుకు నీవు ఆశ్చర్యపడవద్దు.