Skip to content

Fishes గురించి బైబిల్ వచనాలు

15 వచనాలు · 35 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. “ ‘సముద్రాల్లో నదులలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.

  2. సముద్రంలో గాని, నదిలో గాని నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోను, నీటి ప్రాణుల్లోను రెక్కలు, పొలుసులు లేనివాటిని మీరు అపవిత్రమైనవిగా చూడాలి.

  3. అవి అపవిత్రమైనవి కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు; వాటి కళేబరాలను మీరు అసహ్యించుకోవాలి.

  4. రెక్కలు, పొలుసులు లేని జలచరాలేవైనా అపవిత్రమైనవిగా చూడాలి.

  5. వారు యేసుతో, “ఇక్కడ మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమి లేవు” అని జవాబిచ్చారు.

  6. ఆయన, “వాటిని నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పారు.

  7. వారిని పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని చెప్పి ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి తన శిష్యులకు ఇచ్చారు, శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు.

  8. వారందరు తృప్తిగా తిన్నారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.

  9. తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

  10. ఆయన మాట్లాడడం ముగించాక, ఆయన సీమోనుతో, “పడవను నీటి లోతుకు నడిపించి, చేపలు పట్టడానికి వలలు వేయి” అన్నారు.

  11. అందుకు సీమోను, “బోధకుడా, రాత్రంతా కష్టపడినా మేము ఏమి దొరకలేదు. అయినా నీవు చెప్పావు కాబట్టి నేను వలలను వేస్తాను” అని ఆయనతో అన్నాడు.

  12. వారు అలా చేసినప్పుడు, విస్తారమైన చేపలు వలల్లో పడి ఆ వలలు పిగిలిపోసాగాయి.

  13. ఆయన, “పడవకు కుడి వైపున మీ వలలు వేయండి, మీకు దొరుకుతాయి” అని చెప్పగా వారు అలాగే చేశారు. అప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి కాబట్టి వారు ఆ వలలను లాగలేకపోయారు.

  14. యేసు ప్రేమించిన శిష్యుడు సీమోను పేతురుతో, “ఆయన ప్రభువు!” అన్నాడు. “ఆయన ప్రభువు” అని పేతురు విన్న వెంటనే ఇంతకుముందు తీసి వేసిన పైబట్టను తన చుట్టూ వేసుకుని నీటిలోనికి దూకాడు.

  15. పడవలో ఉన్న మిగతా శిష్యులు చేపలున్న వలను లాగుతూ ఉన్నారు. అప్పుడు వారు ఒడ్డుకు సుమారు వంద గజాల దూరంలో మాత్రమే ఉన్నారు.