Skip to content

Earthquakes గురించి బైబిల్ వచనాలు

9 వచనాలు · 27 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.

  2. జలాలు గర్జించినా నురుగు కట్టినా పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా

  3. సైన్యాల యెహోవా ఉగ్రత కారణంగా ఆయన కోపం రగులుకున్న రోజున ఆకాశం వణికేలా చేస్తాను; భూమి తన స్థానం నుండి తప్పుకునేలా చేస్తాను.

  4. తరుమబడుతున్న జింకలా, కాపరి లేని గొర్రెలా, వారు తమ సొంత ప్రజల వైపు తిరుగుతారు, వారు తమ స్వదేశాలకు పారిపోతారు.

  5. భూమి బద్దలై పోయింది, భూమి ముక్కలుగా చీలిపోయింది, భూమి భయంకరంగా అదురుతుంది.

  6. భూమి త్రాగుబోతులా తూలుతుంది, గాలికి ఊగే పాకలా ఇటు అటు ఊగుతుంది. దాని తిరుగుబాటు అపరాధం దానిపై బరువుగా ఉంది అది ఇక లేవనంతగా పడిపోతుంది.

  7. ఆ వధించబడిన గొర్రెపిల్ల ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. అప్పుడు సూర్యుడు మేక బొచ్చుతో చేసిన గోనెపట్టలా నల్లగా మారాడు, చంద్రుడు రక్తంలా ఎర్రగా మారాడు.

  8. బలమైన గాలికి అంజూర చెట్టు నుండి రాలిపడిన కాయల్లా ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద రాలాయి.

  9. ఆకాశం ఒక గ్రంథపుచుట్టలా చుట్టుకుపోయింది, ప్రతి పర్వతం ప్రతి ద్వీపం వాటి వాటి స్థలాల నుండి తొలగిపోయాయి.