కంటెంట్‌కు వెళ్లండి

Court గురించి బైబిల్ వచనాలు: Sentence of, final and obligatory

5 వచనాలు · 4 కోణాలు

Sentence of, final and obligatory గురించి వచనాలు

  1. మీ దగ్గరకు వచ్చిన వివాదాలలో మీరు తీర్పు తీర్చడానికి చాలా కష్టంగా ఉన్న వివాదాలను అంటే రక్తపాతానికి సంబంధించినవి గాని వాదనలు గాని దాడులు గాని అలాంటి వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలానికి తీసుకెళ్లండి.

  2. లేవీయ యాజకుల దగ్గరకు, ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు వెళ్లండి. వాటి గురించి విచారించండి, వారు మీకు తీర్పు ఇస్తారు.

  3. మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలంలో వారు మీకు తెలియజేసిన నిర్ణయాల ప్రకారం మీరు నడుచుకోవాలి. మీరు చేయాలని వారు మీకు చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి.

  4. వారు మీకు బోధించిన, ఇచ్చిన నిర్ణయాల ప్రకారం మీరు చేయాలి. వారు మీకు చెప్పిన వాటినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు.

  5. న్యాయమూర్తి పట్ల గాని మీ దేవుడైన యెహోవాకు సేవచేసే యాజకుని పట్ల గాని ఎవరైనా ధిక్కారం ప్రదర్శిస్తే, వారికి మరణశిక్ష విధించబడాలి. మీరు ఈ దుర్మార్గాన్ని ఇశ్రాయేలు నుండి తొలగించాలి.