Blood గురించి బైబిల్ వచనాలు: Forbidden to be used as food
Forbidden to be used as food గురించి వచనాలు
మీరు నివసించే చోట పక్షి రక్తం గాని, జంతు రక్తం గాని తినకూడదు.
ఎవరైనా రక్తాన్ని తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”
“ ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా రక్తాన్ని తింటే వారికి నేను విరోధంగా ఉంటాను, వారిని తమ ప్రజల నుండి తొలగిస్తాను.
ఎందుకంటే, ఒక జీవికి ప్రాణం రక్తంలో ఉంది, బలిపీఠం మీద మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నేను దానిని మీకిచ్చాను. ఇది ఒకరి జీవితానికి ప్రాయశ్చిత్తం చేసే రక్తము.
అందుకే, “మీలో గాని, మీ మధ్య ఉన్న విదేశీయులలో గాని ఎవరూ రక్తాన్ని తినకూడదు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.
“ ‘ఇశ్రాయేలీయులలో వారి మధ్య నివసించే విదేశీయులలో ఎవరైనా వేటాడుతూ జంతువును గాని పక్షిని గాని పట్టుకుంటే అతడు దాని రక్తాన్ని పూర్తిగా పారబోసి మట్టితో కప్పెయ్యాలి,
ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణం దాని రక్తము. అందుకే, “ప్రతి జీవికి ప్రాణం దాని రక్తం కాబట్టి మీరు ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదు. ఎవరైన దానిని తింటే వారు తొలిగించబడతారు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.