కంటెంట్‌కు వెళ్లండి

Jael

6 వచనాలు · 1 కుటుంబ సభ్యుడు

Jael ను ప్రస్తావించే వచనాలు

  1. హాసోరు రాజైన యాబీనుకు, కెనీయుడైన హెబెరు కుటుంబానికి మధ్య స్నేహబంధం ఉండేది కాబట్టి సీసెరా కాలినడకన కెనీయుడైన హెబెరు భార్యయైన యాయేలు గుడారానికి పారిపోయాడు.

  2. యాయేలు సీసెరాను కలుసుకోడానికి బయటకు వెళ్లి, “నా ప్రభువా, లోనికి రండి. భయపడకండి” అని అన్నది. కాబట్టి అతడు గుడారంలోకి వెళ్లగా ఆమె దుప్పటితో అతన్ని కప్పింది.

  3. అయితే హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు సుత్తిని తీసుకుని, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని దగ్గరకు నెమ్మదిగా వెళ్లింది. ఆమె ఆ మేకును అతని కణతలలో నుండి నేలలోకి దిగగొట్టగా అతడు చనిపోయాడు.

  4. అప్పుడు బారాకు సీసెరాను తరుముతూ వెళ్తునప్పుడు యాయేలు అతన్ని ఎదుర్కొని, “రండి, మీరు వెదుకుతున్న మనిషిని నేను చూపిస్తాను” అని అన్నది. అతడు ఆమెతో లోనికి వచ్చినప్పుడు, అక్కడ సీసెరా కణతలలో మేకుతో చచ్చి పడి ఉన్నాడు.

  5. అనాతు కుమారుడైన షమ్గరు రోజుల్లో, యాయేలు రోజుల్లో రాజమార్గాలు నిర్జనమయ్యాయి; ప్రయాణికులు ప్రక్క త్రోవల్లో నడిచారు.

  6. “కెనీయుడైన హెబెరు భార్య యాయేలు, స్త్రీలలో ఎక్కువ దీవించబడుతుంది, గుడారాల్లో నివసించే స్త్రీలందరిలో ఎక్కువ దీవించబడుతుంది.