Skip to content
పరమగీతము 8:8-14

పరమగీతము 8:8-14

8
మాకో చిన్న చెల్లెలుంది, దానికింకా స్తనములు రాలేదు. దానికి పెళ్ళి నిశ్చయమైతే ఏం చేయాలి?
9
ఒకవేళ ఆమె ప్రాకారమైతే, ఆమెపై మేము వెండి గోపురం కట్టిస్తాము. ఒకవేళ ఆమె ద్వారం అయితే, దేవదారు పలకలతో దానికి భద్రత ఏర్పరుస్తాము.
10
నేను ప్రాకారాన్ని, నా స్తనములు గోపురాల్లాంటివి. అందుకే అతని దృష్టికి క్షేమం పొందదగినదానిగా ఉన్నాను.
11
బయల్-హామోను దగ్గర సొలొమోనుకు ద్రాక్షతోట ఉంది; అతడు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చాడు. దాని ఫలానికి ఒక్కొక్కడు వెయ్యి వెండి షెకెళ్ళ శిస్తు చెల్లించాలి.
12
కాని, నా ద్రాక్షవనం నా స్వాధీనంలోనే ఉంది; సొలొమోను రాజా, నీ వెయ్యి షెకెళ్ళు నీకే చెందుతాయి. వాటిని చూసుకునే వారికి రెండువందలు షెకెళ్ళు గిట్టుతాయి.
13
ఉద్యానవనాల్లో నివసించేదానా నీ చెలికత్తెలు నీతో ఉండగా, నీ స్వరం విననివ్వు.
14
నా ప్రియుడా, దూరంగా రా, జింకలా, దుప్పిలా పరిమళముల పర్వతాల మీదుగా గంతులు వేస్తూ రా.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options