Skip to content
పరమగీతము 8:5-7

దంపతులు తిరిగిరావుట; మరణమంత బలమైన ప్రేమ

పరమగీతము 8:5-7
5
తన ప్రియుని ఆనుకుని అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు? యువకుడు ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను; అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది, అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది.
6
నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా, మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో; ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది, దాని అసూయ సమాధిలా క్రూరమైనది. ఇది మండుతున్న అగ్నిలా, శక్తివంతమైన మంటలా కాలుతుంది.
7
పెరుగుతున్న జలాలు ప్రేమను అణచివేయలేవు; నదీజలాలు ప్రేమను తుడిచివేయలేవు. ప్రేమకు ప్రతిగా తనకున్నదంతా ఇచ్చినా, దానికి తిరస్కారమే లభిస్తుంది.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.