Skip to content
పరమగీతము 8:1-4

అపరిమితమైన ప్రేమాభిమానానికై కోరిక

పరమగీతము 8:1-4
1
ఒకవేళ నీవు నాకు సోదరుడిలా ఉంటే, నా తల్లి స్తనముల దగ్గర పెంచబడిన వాడవైయుంటే! అప్పుడు, నేను నిన్ను బయట కనుగొని ఉంటే, నిన్ను ముద్దాడేదాన్ని, నన్ను ఎవరూ నిందించేవారు కారు.
2
నేను నిన్ను తోలుకొని నాకు ఉపదేశం చేసిన, నా తల్లి ఇంటికి తీసుకెళ్లేదాన్ని. నీవు త్రాగడానికి నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసాన్ని, దానిమ్మపండ్ల మకరందం ఇచ్చేదాన్ని.
3
ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు, కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు.
4
యెరూషలేము కుమార్తెలారా! మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.