పరమగీతము 2:1-5
1
నేను షారోను పొలంలో పూసిన గులాబిని, లోయల్లో వికసించిన తామర పువ్వును.
2
ముళ్ళ మధ్య తామర పువ్వులా నా ప్రియురాలు ఈ కన్యకల మధ్య కనిపిస్తూ ఉన్నది.
3
అడవి చెట్ల మధ్య ఆపిల్ వృక్షంలా నా ప్రియుడు యువకుల మధ్య ఉన్నాడు, ఆయన నీడలో ఆనందమయినై కూర్చుండిపోయాను, ఆయన ఫలం నా రుచికి మధురము.
4
నన్ను ఆయన విందుశాలకు నడిపించారు, ఆయన నన్ను ప్రేమతో కప్పివేశారు.
5
ఎండు ద్రాక్షపండ్లతో నన్ను బలోపేతం చేయండి, ఆపిల్ పండ్లతో తినిపించండి. ఎందుకంటే నేను ప్రేమతో మూర్ఛపోయాను.
Settings