రోమీయులకు 8:5-9
5
శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది.
6
శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది.
7
శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు.
8
శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు.
9
అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కాబట్టి శరీర స్వభావం కలిగి ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు క్రీస్తుకు చెందినవారు కారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings