- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
నూతన ఆకాశము మరియు నూతన భూమి
ప్రకటన 21:1-8
1
అప్పుడు నేను “క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని” చూశాను. మొదట ఉన్న ఆకాశం, భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేకపోయింది.
2
అప్పుడు తన భర్త కోసం అలంకరించుకొని సిద్ధపడిన ఒక వధువులా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలో దేవుని దగ్గర నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను.
3
అప్పుడు దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, “ఇదిగో, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యుల మధ్యలో ఉంది, ఆయన వారితో నివసిస్తారు. అప్పుడు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారికి దేవుడై ఉంటారు.
4
‘ఆయన వారి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు. మొదటి సంగతులు గతించి పోయాయి కాబట్టి అక్కడ చావు ఉండదు, దుఃఖం గాని ఏడ్పు గాని బాధ గాని ఎన్నడూ ఉండదు’ ” అని చెప్తుంటే నేను విన్నాను.
5
అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవుడు, “ఇదిగో, సమస్తాన్ని నూతనపరుస్తున్నాను” అని చెప్పి, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి కాబట్టి వీటిని వ్రాసి పెట్టు” అన్నారు.
6
ఆయన నాతో, “సమాప్తమైనది. అల్ఫా ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.
7
జయించేవారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు.
8
అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు.
Settings