కీర్తనలు 90:3-10
3
“మనుష్యులారా, మీరు మంటికి తిరిగి వెళ్లండి” అని అంటూ, మీరు ప్రజలను ధూళి వైపుకు తిరిగి త్రిప్పుతారు.
4
మీ దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఇప్పుడే గడిచిన రోజులా, రాత్రి జాముల్లా ఉన్నాయి.
5
అయినప్పటికీ మీరు మరణ నిద్రలో ప్రజలను ప్రవాహంలా తుడిచివేస్తారు; వారు ప్రొద్దున్నే మొలిచిన గడ్డిలా ఉన్నారు.
6
అది ఉదయం క్రొత్తగా పుడుతుంది, సాయంకాలానికల్లా వాడి ఎండిపోతుంది.
7
మేము మీ కోపాగ్నికి దహించుకు పోతున్నాము మీ ఆగ్రహానికి భయపడుతున్నాము.
8
మీరు మా దోషాలను మీ ఎదుట, మా రహస్య పాపాలను మీ సన్నిధి కాంతిలో ఉంచారు.
9
మా దినాలన్ని మీ ఉగ్రత లోనే గడిచిపోయాయి; మేము మా సంవత్సరాలను మూలుగుతో ముగిస్తాము.
10
మా ఆయుష్షు డెబ్బై సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు; అయినా వాటి వైభవం నాశనం దుష్టత్వం, అవి త్వరగా గడచిపోతాయి, మేము ఎగిరిపోతాం.
Settings