కీర్తనలు 86:1-4
1
ఒక దావీదు ప్రార్థన. యెహోవా, చెవియొగ్గి ఆలకించండి, నాకు జవాబివ్వండి, ఎందుకంటే నేను దీనుడను నిరుపేదను.
2
మీపట్ల విశ్వాసంగా ఉన్న నా ప్రాణాన్ని కాపాడండి; మీయందు నమ్మకం ఉంచిన సేవకుడిని రక్షించండి. మీరే నా దేవుడు;
3
ప్రభువా! నాపై దయచూపండి. దినమంతా నేను మీకు మొరపెడుతున్నాను.
4
ప్రభువా, మీ సేవకునికి ఆనందం ప్రసాదించండి, ఎందుకంటే నేను మీయందు నమ్మకం ఉంచాను.
Settings