కీర్తనలు 81:4-8
4
ఇశ్రాయేలీయులకు ఇది శాసనం; ఇది యాకోబు దేవుడు ఇచ్చిన నియమము.
5
దేవుడు ఈజిప్టు మీదికి దండెత్తినప్పుడు, ఆయన దానిని యోసేపుకు శాసనంలా స్థాపించారు. తెలియని స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను:
6
“నేను వారి భుజాల మీది నుండి భారం తొలగించాను; వారి చేతులు గంపలెత్తుట నుండి విడిపించబడ్డాయి.
7
మీ బాధలో మీరు మొరపెట్టగా నేను మిమ్మల్ని రక్షించాను, ఉరుములతో కూడిన మేఘంలో నుండి నేను మీకు జవాబు ఇచ్చాను; మెరీబా జలాల దగ్గర నేను మిమ్మల్ని పరీక్షించాను. సెలా
8
నా ప్రజలారా, నా మాట వినండి, నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట మాత్రం వింటే ఎంత మేలు!
Settings