కీర్తనలు 81:1-5
1
సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. ఆసాపు కీర్తన. మనకు బలంగా ఉన్న దేవునికి ఆనంద గానం చేయండి; యాకోబు దేవునికి బిగ్గరగా కేకలు వేయండి!
2
సంగీతం మొదలుపెట్టండి, కంజర వాయించండి. మధురంగా సితారా వీణ మీటండి.
3
అమావాస్య దినాన కొమ్ము ఊదండి, పౌర్ణమి పండుగ దినాన కొమ్ము ఊదండి;
4
ఇశ్రాయేలీయులకు ఇది శాసనం; ఇది యాకోబు దేవుడు ఇచ్చిన నియమము.
5
దేవుడు ఈజిప్టు మీదికి దండెత్తినప్పుడు, ఆయన దానిని యోసేపుకు శాసనంలా స్థాపించారు. తెలియని స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను:
Settings