Skip to content
కీర్తనలు 73:12-22

కీర్తనలు 73:12-22

12
దుష్టులు ఇలా ఉంటారు. ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు.
13
నేను నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే నేను నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే.
14
రోజంతా నేను బాధింపబడ్డాను, ప్రతి ఉదయం నూతన శిక్షలు వస్తున్నాయి.
15
నేను అలా మాట్లాడాలని అనుకుని ఉంటే, నేను మీ పిల్లలను మోసం చేసినట్టే.
16
ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది; అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను.
18
ఖచ్చితంగా మీరు వారిని జారే నేలపై ఉంచారు; మీరు వారిని పతనానికి పడవేస్తారు.
19
వారు అకస్మాత్తుగా నాశనమవుతారు, వారు భయంతో పూర్తిగా నశిస్తారు!
20
ప్రభువా, మీరు లేచినప్పుడు, ఒకరు మేల్కొన్నప్పుడు ఒక కలలో చూసినవి మరచినట్లు; మీరు వారి ఉనికిని తృణీకరిస్తారు.
21
నా హృదయం దుఃఖించినప్పుడు నా ఆత్మ నీరసించినప్పుడు,
22
నేను తెలివిలేని వాడను, అజ్ఞానిని; మీ ఎదుట నేను క్రూరమైన మృగంలా ఉన్నాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options