- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
దేవుని గత విమోచనను జ్ఞాపకము చేసికొనుట
కీర్తనలు 44:1-8
1
సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. ఓ దేవా! మా పూర్వికుల రోజుల్లో పురాతన కాలంలో మీరు చేసినదంతా మా పితరులు మాకు చెప్పారు.
2
మీ స్వహస్తంతో దేశాలను వెళ్లగొట్టారు మా పూర్వికులను అక్కడ నిలబెట్టారు; ఆయా జాతుల ప్రజలను నాశనం చేసి మా పూర్వికులను వర్ధిల్లేలా చేశారు.
3
తమ ఖడ్గంతో ఈ దేశాన్ని వారు వశం చేసుకోలేదు, తమ భుజబలంతో విజయం సాధించలేదు; మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీ కుడిచేయి మీ భుజబలం మీ ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది.
4
మీరే మా రాజు, మీరే మా దేవుడు, యాకోబు ప్రజలకు విజయం కలగాలని ఆజ్ఞాపిస్తారు.
5
మీ వలన విరోధులను పడగొట్టగలం; మా మీదికి ఎగబడే వారిని మీ పేరట అణచివేయగలము.
6
మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు, మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు.
7
మా విరోధులపై మాకు విజయమిచ్చేది మీరే, మీరే పగవారికి సిగ్గుపడేలా చేశారు.
8
దేవుని యందు మేము దినమంతా అతిశయిస్తాం మీ నామాన్ని నిత్యం స్తుతిస్తాము. సెలా
Settings