Skip to content
కీర్తనలు 17:4-8

కీర్తనలు 17:4-8

4
మనుష్యులు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, మీ పెదవులు ఆజ్ఞాపించిన దానిని బట్టి నేను హింసాత్మక మార్గాలకు దూరంగా ఉన్నాను.
5
నా అడుగులు మీ మార్గాల్లో నిలిచి ఉన్నాయి; నా పాదాలు తడబడలేదు.
6
నా దేవా! నేను మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు; మీ చెవి నా వైపు త్రిప్పి నా ప్రార్థన ఆలకించండి.
7
మారని మీ ప్రేమలోని అద్భుతాలను నాకు చూపించండి, తమ శత్రువుల నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఆశ్రయించే వారిని మీ కుడిచేతితో మీరు రక్షిస్తారు.
8
నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుష్టుల నుండి, నన్ను చుట్టుముట్టి నా ప్రాణం తీయాలనుకుంటున్న శత్రువుల నుండి మీ కనుపాపలా నన్ను కాపాడండి; మీ రెక్కల నీడలో నన్ను దాచండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options