Skip to content
కీర్తనలు 17:1-5

న్యాయమైన విచారణ కొరకు విన్నపము

కీర్తనలు 17:1-5

న్యాయమైన విచారణ కొరకు విన్నపము

1
దావీదు ప్రార్థన. యెహోవా, న్యాయమైన నా మనవి వినండి; నా మొర ఆలకించండి. నా ప్రార్థన వినండి అది మోసపూరితమైన పెదవుల నుండి రాలేదు.
2
నాకు న్యాయమైన తీర్పు మీ నుండి రావాలి; మీ కళ్లు సరియైన దాన్ని చూడాలి.
3
మీరు నా హృదయాన్ని పరిశీలించినప్పటికి, రాత్రివేళ మీరు నన్ను పరిశీలించి పరీక్షించినప్పటికీ, నాలో ఏ చెడు ఉద్దేశం మీకు కనబడలేదు; నా నోరు అతిక్రమించి మాట్లాడలేదు.
4
మనుష్యులు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, మీ పెదవులు ఆజ్ఞాపించిన దానిని బట్టి నేను హింసాత్మక మార్గాలకు దూరంగా ఉన్నాను.
5
నా అడుగులు మీ మార్గాల్లో నిలిచి ఉన్నాయి; నా పాదాలు తడబడలేదు.

See also

Where else Scripture says this.

  • కీర్తనలు 26:2

    యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి, నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి;
    from verse 3
  • అపొస్తలుల కార్యములు 11:23

    అతడు అక్కడ చేరాక దేవుని కృప చేసిన కార్యాలను చూసి అతడు సంతోషించి, తమ పూర్ణహృదయంతో ప్రభువుకు నమ్మకంగా ఉండాలని వారందరిని ప్రోత్సాహించాడు.
    from verse 3
  • యోబు 23:10

    కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు; ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను.
    from verse 3
  • కీర్తనలు 39:1

    సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన. నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి నా మార్గాలను సరిచూసుకుంటాను; దుష్టులు నా దగ్గర ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను” అని అన్నాను.
    from verse 3
  • కీర్తనలు 44:18

    మా హృదయం వెనుదీయలేదు; మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు.
    from verse 5
  • కీర్తనలు 142:6

    నేను చాలా క్రుంగిపోయాను, నా మొరను ఆలకించండి. నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి, వారు నాకంటే బలంగా ఉన్నారు.
    from verse 1
  • మలాకీ 3:2

    అయితే ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలరు? ఆయన కనబడేటప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి నిప్పులాంటి వాడు, బట్టలను శుద్ధి చేసే చాకలివాని సబ్బు లాంటివాడు.
    from verse 3
  • కీర్తనలు 66:10

    దేవా, మీరు మమ్మల్ని పరీక్షించారు; వెండిలా మమ్మల్ని శుద్ధి చేశారు.
    from verse 3
  • కీర్తనలు 119:106

    నేను మీ నీతిగల న్యాయవిధులను పాటిస్తానని ప్రమాణం చేసి ధృవీకరించాను.
    from verse 3
  • కీర్తనలు 139:1

    ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా మీరు నన్ను పరిశోధించారు, మీరు నన్ను తెలుసుకొన్నారు.
    from verse 3
  • జెకర్యా 13:9

    ఈ మూడవ వంతు ప్రజలను నేను అగ్నిలో నుండి వెండిని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను బంగారాన్ని పరీక్షించినట్లు వారిని పరీక్షిస్తాను. వారు నా పేరట మొరపెడతారు, నేను వారికి జవాబిస్తాను. ‘వారు నా ప్రజలు’ అని నేనంటాను, ‘యెహోవా మా దేవుడు’ అని వారంటారు.”
    from verse 3
  • కీర్తనలు 119:133

    మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక.
    from verse 5
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options