కీర్తనలు 141:1-4
1
దావీదు కీర్తన. యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, నా దగ్గరకు త్వరగా రండి; నా స్వరాన్ని ఆలకించండి.
2
నా ప్రార్థన దూపమువలే మీకు అంగీకారమగును గాక; నా చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యంలా ఉండును గాక.
3
యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి.
4
కీడు చేసేవారితో కలిసి వారి దుష్ట క్రియలలో నేను పాల్గొనకుండునట్లు, నా హృదయాన్ని చెడు వైపు తిరగనివ్వకండి; వారి రుచిగల పదార్థాలు నేను తినకుండ ఉండనివ్వండి!
Settings