Skip to content
కీర్తనలు 136:1-9

కీర్తనలు 136:1-9

1
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
2
దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
3
ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
4
మహాద్భుతాలు చేసేది ఆయన ఒక్కడే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
5
ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
6
నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
7
మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
8
పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
9
రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options