Skip to content
కీర్తనలు 109:20-31

కీర్తనలు 109:20-31

20
నా మీద నేరం మోపేవారికి నా గురించి చెడుగా మాట్లాడేవారికి, యెహోవా వారికి జీతం చెల్లించును గాక.
21
అయితే, ప్రభువైన యెహోవా, మీ నామ ఘనత కోసం నాకు సహాయం చేయండి; శ్రేష్ఠమైన మీ మారని ప్రేమను బట్టి, నన్ను విడుదలచేయండి.
22
ఎందుకంటే నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను, నా హృదయం నాలో గాయపడి ఉంది.
23
నేను సాయంత్రం నీడలా మసకబారుతున్నాను; మిడతలా నేను దులిపివేయబడ్డాను.
24
ఉపవాసాలు ఉండి నా మోకాళ్లు వణికిపోతున్నాయి; నేను అస్థిపంజరంలా అయ్యాను.
25
నా మీద నేరం మోపేవారికి నేను ఎగతాళి హాస్యాస్పదం అయ్యాను; వారు నన్ను చూసినప్పుడు, వారు వెటకారంగా వారి తలలాడిస్తారు.
26
యెహోవా, నా దేవా! నాకు సాయం చేయండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను కాపాడండి.
27
ఇది చేసింది మీ హస్తమేనని, యెహోవాయే చేశారని వారికి తెలియనివ్వండి.
28
వారు నన్ను శపించినప్పుడు మీరు నన్ను దీవిస్తారు; వారు నాపై దాడి చేసినప్పుడు వారు అవమానానికి గురవుతారు, కాని మీ సేవకుడు సంతోషించును గాక.
29
నా మీద నేరం మోపేవారు అవమానాన్ని వస్త్రంగా ధరించుదురు గాక ఒక వస్త్రంలో అయినట్టుగా సిగ్గుతో చుట్టబడతారు.
30
నేను నోరార యెహోవాను కీర్తిస్తాను; ఆరాధికుల గొప్ప సమూహంలో నేను ఆయనను స్తుతిస్తాను.
31
ఎందుకంటే అవసరతలో ఉన్న వారి పక్షాన ఆయన నిలబడతారు, వారికి తీర్పు తీర్చే వారి నుండి వారి ప్రాణాలను కాపాడడానికి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options