Skip to content
కీర్తనలు 107:1-9

కీర్తనలు 107:1-9

1
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు; ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.
2
యెహోవాచేత విమోచింపబడినవారు, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు,
3
వివిధ దేశాల నుండి, తూర్పు పడమర, ఉత్తర దక్షిణాల నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక.
4
కొందరు ఏకాంతంగా ఎడారిలో తిరిగారు; నివాసయోగ్యమైన పట్టణం ఒక్కటి వారికి కనిపించలేదు.
5
వారు ఆకలి దప్పికతో ఉన్నారు, వారి ప్రాణాలు సొమ్మసిల్లాయి.
6
అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధలనుండి విడిపించారు.
7
ఆయన వారిని తిన్నని బాటలో నివాసయోగ్యమైన పట్టణానికి నడిపించారు.
8
యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
9
దాహంతో ఉన్న వారి దాహాన్ని ఆయన తీరుస్తారు, మేలైన వాటితో ఆయన ఆకలి తీర్చుతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options