కీర్తనలు 105:34-46
34
ఆయన ఆజ్ఞ ఇవ్వగా మిడతలు, లెక్కలేనన్ని చీడ పురుగులు వచ్చి పడ్డాయి.
35
ఆ దేశంలో కూరగాయల మొక్కలన్నిటినీ పురుగులు తినేశాయి, భూమి పంటలను తినేశాయి.
36
వారి దేశంలో ఉన్న జ్యేష్ఠులందరిని వారి ప్రథమ సంతానమంతటిని ఆయన హతమార్చారు.
37
ఇశ్రాయేలీయులను వెండి బంగారములతో దేవుడు బయిటకి రప్పించాడు. ఆయన ఇశ్రాయేలు గోత్రాల్లో ఎవరూ తొట్రుపడరు.
38
వారంటే ఈజిప్టువారికి భయం పట్టుకుంది, వారు వెళ్లి పోతుంటే, వీరు సంతోషించారు.
39
దేవుడు పరచిన మేఘపు దుప్పి వారిని కప్పింది, రాత్రివేళ వెలుగు కోసం అగ్ని నిచ్చాడు దేవుడు.
40
వారు కోరుకున్నట్లే దేవుడు పూరేడుపిట్టలను పంపించాడు. ఆకాశం నుండి వచ్చే ఆహారంతో వారంతా తృప్తి చెందారు.
41
దేవుడు బండను చీల్చాడు. అందులో నుండి నీరు ఉబికి బయటకు వచ్చింది. ఆ మీరు నదీ ప్రవాహంలా ఎడారి స్థలాల్లో పారింది.
42
ఆయన తన సేవకుడైన అబ్రాహాముకు చేసిన పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.
43
తన ప్రజలను సంతోషంతో బయిటకి తెచ్చాడు. తాను ఎన్నుకున్న ప్రజలను ఆనంద ధ్వనులతో రప్పించాడు.
44
ఆయన వారికి దేశాల భూములను ఇచ్చారు, ఇతరులు శ్రమించినదానికి వారు వారసులయ్యారు.
45
వారు ఆయన కట్టడలను అనుసరించాలని ఆయన న్యాయవిధులను పాటించాలని. యెహోవాను స్తుతించండి!
Settings