కీర్తనలు 105:13-33
13
వారు దేశం నుండి దేశానికి, ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.
14
ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు; వారి కోసం ఆయన రాజులను మందలించారు:
15
“నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు; నా ప్రవక్తలకు హాని చేయకూడదు.”
16
ఆయన భూమిపై కరువును పిలిచారు వారి ఆహార సరఫరా అంతా నాశనం చేశారు;
17
వారికి ముందుగా ఒక మనుష్యుని పంపారు, ఒక బానిసగా అమ్మబడిన యోసేపును,
18
తాను చెప్పింది జరిగే వరకు, యెహోవా యోసేపు ప్రవర్తనను పరీక్షించారు, వారు అతని పాదాలను సంకెళ్ళతో గాయపరిచారు, అతని మెడ సంకెళ్ళలో ఉంచబడింది.
20
రాజు కబురుపెట్టి, అతన్ని విడుదల చేశాడు, జనాంగాల పాలకుడు అతన్ని విడిపించాడు.
21
అతడు యోసేపును తన ఇంటి యజమానిగా, తన స్వాస్థ్యమంతటి మీద పాలకునిగా చేశాడు, తనకు నచ్చిన విధంగా తన యువరాజులకు సూచించడానికి పెద్దలకు జ్ఞానాన్ని బోధించడానికి అధికారం ఇచ్చాడు.
23
యాకోబు అనబడిన ఇశ్రాయేలు ఆ తర్వాత హాము దేశమైన ఈజిప్టుకు వెళ్లి, అక్కడే ప్రవాసం చేశాడు.
24
యెహోవా తన ప్రజలకు అధిక సంతాన మిచ్చాడు; వారిని శత్రువుల కన్నా బలవంతులుగా చేశారు.
25
తన ప్రజలను వారు ద్వేషించేలా ఆయన వారి హృదయాలు మార్చివేశారు, తన సేవకులకు వ్యతిరేకంగా కుట్ర చేసేలా వారిని పురికొల్పారు.
26
ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపారు.
27
ఈజిప్టువారి మధ్య సూచక క్రియలు, హాము దేశంలో అద్భుతాలు జరిగించారు.
28
యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు; వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు.
29
ఆయన వారి జలాలను రక్తంగా మార్చారు, వారి చేపలన్నిటిని చనిపోయేలా చేశారు.
30
వారి దేశం కప్పలతో నిండిపోయింది, వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి.
31
ఆయన ఆజ్ఞ ఇవ్వగా, జోరీగలు వచ్చాయి, వారి దేశమంతటా దోమలు వచ్చాయి.
32
దేశమంతటా ఆయన మెరుపులు మెరిపిస్తూ, వడగండ్ల వాన కురిపించారు.
33
ఆయన వారి ద్రాక్షతీగెలను అంజూర చెట్లను పడగొట్టారు వారి దేశంలోని వృక్షాలను విరగ్గొట్టారు.
Settings