Skip to content
సామెతలు 29:8-14

జ్ఞానవంతమైన సంభాషణ మరియు న్యాయపాలన

సామెతలు 29:8-14
8
ఎగతాళి చేసేవారు పట్టణాన్ని తల్లడిల్లజేస్తారు, జ్ఞానులు కోపం చల్లార్చెదరు.
9
ఒకవేళ జ్ఞానియైన వ్యక్తి మూర్ఖునితో న్యాయస్థానానికి వెళ్తే, బుద్ధిహీనుడు కోపంతో ఎగతాళి చేస్తాడు, అప్పుడు అక్కడ వారికి సమాధానం ఉండదు.
10
రక్తపిపాసులు నిజాయితీ కల వ్యక్తిని ద్వేషిస్తారు యథార్థవంతులను చంపాలని చూస్తారు.
11
మూర్ఖులు వారి కోపాన్ని వెదజల్లుతారు, కాని జ్ఞానులు చివరికి ప్రశాంతత తెస్తారు.
12
ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే, తన అధికారులంతా దుష్టులవుతారు.
13
పేదవారు అణగారినవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వీరిద్దరి కళ్లకు చూపు ఇచ్చేవాడు యెహోవా.
14
ఏ రాజు పేదలకు సత్యంగా న్యాయం తీరుస్తాడో, ఆ రాజు సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options