Skip to content
సామెతలు 28:19-28

శ్రమ, సంపద, విశ్వాసం

సామెతలు 28:19-28
19
తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి దరిద్రత నిండుతుంది.
20
నమ్మకమైన వ్యక్తి అధికంగా దీవించబడతాడు, కాని ధనము సంపాదించాలని ఆరాటపడేవాడు శిక్ష పొందక మానడు.
21
పక్షపాతం చూపడం మంచిది కాదు అయినా రొట్టె ముక్క కోసం మనుష్యులు తప్పు చేస్తారు.
22
పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు.
23
నాలుకతో పొగిడే వారికన్నా, మనుష్యులను గద్దించేవారే చివరికి ఎక్కువ ఇష్టమవుతారు.
24
తన తల్లిదండ్రులను దోచుకొని “ఇది ద్రోహం కాదు” అనేవాడు నాశనం చేసేవానికి భాగస్వామి.
25
దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు, కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు.
26
తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు, కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు.
27
పేదవారికి ఇచ్చేవారికి ఏదీ కొదువ కాదు, కాని వారి పట్ల కళ్లు మూసుకొనే వారికి అనేక శాపాలు కలుగుతాయి.
28
దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు; కాని దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు వృద్ధిచెందుతారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options