సామెతలు 23:29-32
29
ఎవరికి శ్రమ ఉంది? ఎవరికి దుఃఖం ఉంది? ఎవరికి కలహాలు ఉన్నాయి? ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయి? ఎవరికి అవసరంలేని గాయాలు? ఎవరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి?
30
మద్యంతో ప్రొద్దుపుచ్చేవారు, నమూనా మద్యమాల మిశ్రమాలను రుచిచూడడానికి వెళ్లేవారు.
31
మద్యం ఎర్రగా ఉన్నప్పుడు, గిన్నెలో తళతళలాడుతూ, గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు!
32
అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది.
Settings