కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 21:27-31

దుష్ట ప్రణాళికల వ్యర్థత

సామెతలు 21:27-31
27
దుష్టుల బలులు అసహ్యం, చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో!
28
అబద్ధ సాక్షులు నశిస్తారు, కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు.
29
దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, కాని యథార్థవంతులు తమ మార్గాల గురించి ఆలోచిస్తారు.
30
యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు.
31
యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి, కాని విజయం యెహోవా దగ్గర ఉంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options