Skip to content
సామెతలు 16:16-24

జ్ఞానం మరియు వినయానికి ప్రాధాన్యత

సామెతలు 16:16-24
16
బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం, వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!
17
యథార్థవంతుల రాజమార్గం చెడును తప్పిస్తుంది; తమ మార్గాలను కాపాడుకునేవారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు.
18
నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.
19
గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే, అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు.
20
ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.
21
జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు, దయగల మాటలు ఒప్పింపజేస్తాయి.
22
వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట, కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది.
23
జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగిస్తుంది, వాని పెదవులకు విద్య ఎక్కువయేలా చేస్తుంది.
24
దయ గల మాటలు తేనెతెట్టె వంటివి, అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options