సామెతలు 16:25-33
25
ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
26
కష్టం చేసేవారి ఆకలి వానిచేత కష్టం చేయిస్తుంది, వారి ఆకలి వారిని ముందుకు నడిపిస్తుంది.
27
పనికిమాలినవారు కీడును పన్నాగం వేస్తారు, వారి మాటలు మండుతున్న అగ్నిలాంటివి.
28
మూర్ఖులు తగవు రేపుతారు, పుకార్లు సన్నిహితులైన స్నేహితులను వేరు చేస్తాయి.
29
హింసాత్మకమైన వారు వారి పొరుగువారిని ఆశపెడతారు, సరియైనది కాని మార్గంలో వారిని నడిపిస్తారు.
30
తమ కన్ను గీటేవారు కుట్ర పన్నుతున్నారు; తన పెదవులు బిగబట్టేవారు కీడు వైపు మొగ్గు చూపుతారు.
31
నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది.
32
యుద్ధవీరునికంటే సహనం గలవాడు, పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవానికంటే తన మనస్సును అదుపు చేసుకోగలవాడు మేలు.
33
చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము.
Settings