కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 14:28-35

పాలనకు సంబంధించిన సూత్రాలు

సామెతలు 14:28-35
28
జనాభా ఎక్కువ ఉండడం చేత రాజులకు ఘనత వస్తుంది, జనులు తగ్గిపోవడం రాజులకు నాశనకరము.
29
ఎక్కువ ఓర్పు కలవారు మహా వివేకులు, త్వరగా కోప్పడేవారు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారు.
30
సమాధానం గల హృదయం శరీరానికి జీవం, అసూయ ఎముకలకు కుళ్ళు.
31
పేదవాని బాధపెట్టేవారు వాని సృష్టికర్తను నిందించేవారు, బీదలను కనికరించేవారు ఆయనను ఘనపరిచేవారు.
32
అపాయం వచ్చినప్పుడు దుష్టులు నశిస్తారు, చనిపోయే సమయంలో కూడ నీతిమంతులకు దేవునిలో ఆశ్రయం దొరుకుతుంది.
33
వివేకం గలవాని హృదయంలో జ్ఞానం నివాసం చేస్తుంది, మూర్ఖుల మధ్య కూడా అది తనను తాను తెలియపరచుకుంటుంది.
34
నీతి ఒక దేశాన్ని ఘనతకెక్కేలా చేస్తుంది, పాపం ప్రజలకు అవమానం తెస్తుంది.
35
జ్ఞానంగల సేవకుడు రాజులకు ఇష్టుడు, అవమానకరమైన సేవకుడు రాజుకు కోపం రేపుతాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options