Skip to content
సామెతలు 15:1-7

సామెతలు 15:1-7

1
మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది, నొప్పించే మాట కోపం రేపుతుంది.
2
జ్ఞానుల నాలుక తెలివితో అలంకరించబడుతుంది, బుద్ధిహీనుని నోరు మూర్ఖత్వాన్ని కుమ్మరిస్తుంది.
3
యెహోవా కళ్లు ప్రతిచోట ఉంటాయి, చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాయి.
4
నెమ్మది గల నాలుక జీవ వృక్షము కాని పనికిమాలిన నాలుక ఆత్మకు భంగము కలుగజేస్తుంది.
5
మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.
6
నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది, కాని దుష్టుని కలుగు వచ్చుబడి కష్టానికి కారణము.
7
జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల హృదయం నిలకడయైనది కాదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options