Skip to content
సామెతలు 11:22-26

సౌందర్యం, ఉదారత, సంపద

సామెతలు 11:22-26
22
మంచిచెడులు తెలియని అందమైన స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మివంటిది.
23
నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, దుష్టుల కోరిక గర్వంతో నిండి ఉంటుంది.
24
ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు కలరు; ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తూ దరిద్రులైన వారు కలరు.
25
దీవించే మనస్సు గలవారు వృద్ధిచెందుతారు, నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడతాయి.
26
ధాన్యాన్ని అమ్మకుండా దాచుకునేవాన్ని ప్రజలు శపిస్తారు, వాటిని అమ్మే వాని తల మీదికి దీవెనలు వస్తాయి.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.