Skip to content
సామెతలు 11:27-31

మేలును వెదకుట మరియు తుదిప్రతిఫలం

సామెతలు 11:27-31
27
మేలు చేయాలని కోరేవారు దయను పొందుతారు, కీడు చేసేవారికి కీడే కలుగుతుంది.
28
సంపదను నమ్ముకునేవారు పాడైపోతారు, నీతిమంతులు చిగురాకువలే అభివృద్ధి పొందుతారు.
29
తన ఇంటివారిని బాధపెట్టేవారు ఏమీ సంపాదించుకోలేరు, మూర్ఖులు జ్ఞానంగలవారికి దాసులుగా ఉంటారు.
30
నీతిమంతుల ఫలం జీవవృక్షంలా ఉంటుంది, జ్ఞానంగలవారు జీవితాలను కాపాడతారు.
31
నీతిమంతులు భూమి మీద తమ ప్రతిఫలం పొందితే, భక్తిహీనులు, పాపాత్ముల గతి ఖచ్చితంగా అలాగే ఉంటుంది కదా!
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options