సామెతలు 10:8-14
8
జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.
9
యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు, కానీ మోసం చేసేవారు పట్టుబడతారు.
10
కళ్లతో సైగ చేసేవారు దుఃఖాన్ని కలిగిస్తారు, వ్యర్థ కబుర్లు చెప్పే మూర్ఖులు నాశనమవుతారు.
11
నీతిమంతుల నోరు జీవపుఊట, కాని దుష్టుల నోరు హింసను దాచిపెడుతుంది.
12
పగ తగాదాలను కలుగజేస్తుంది, ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది.
13
వివేచన గలవారి పెదవుల మీద జ్ఞానం కనబడుతుంది, కాని తెలివిలేని వారి వీపు మీద బెత్తంతో కొట్టబడతారు.
14
జ్ఞానులు తెలివిని సంపాదించుకుంటారు, బుద్ధిహీనుల నాశనాన్ని ఆహ్వానిస్తుంది.
Settings