Skip to content
ఫిలేమోను 1:1-17

ఫిలేమోను 1:1-17

1
క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి,
2
మన సహోదరి అప్ఫియకు, తోటి సైనికుడైన అర్ఖిప్పుకు, మీ ఇంట్లో కూడుకొనే సంఘానికి వ్రాయునది:
3
మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక.
4
ప్రభువైన యేసులో నీకున్న విశ్వాసం, దేవుని ప్రజల పట్ల నీవు చూపే ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసికొని, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
6
క్రీస్తు కోసం మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో పాలివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
7
సహోదరుడా, నీవు పరిశుద్ధుల హృదయాలను సేదదీర్చినందుకు, నీ ప్రేమ నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది.
8
అందువల్ల, నీవేమి చేయాలనే దాని గురించి, క్రీస్తులో నేను ధైర్యంగా నిన్ను ఆజ్ఞాపించగలిగినా,
9
ముసలివాన్ని ఇప్పుడు యేసు క్రీస్తు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను.
10
నేను సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు నాకు కుమారునిగా మారిన ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను.
11
గతంలో అతడు నీకు నిష్ప్రయోజకుడే కావచ్చు, కాని ఇప్పుడు అతడు నీకు నాకు, ఇద్దరికి ఉపయోగపడే వానిగా అయ్యాడు.
12
నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను.
13
నేను సువార్త కోసం సంకెళ్ళతో బంధింపబడి ఉన్న సమయంలో నాకు సహాయం చేయడానికి నీ బదులుగా అతన్ని నాతో పాటు ఉంచుకుని ఉండేవాన్ని.
14
కానీ, నీకు తెలియజేయకుండా నేను ఏమి చేయాలనుకోలేదు, ఎందుకంటే నీవు చేసే ఏ సహాయమైనా నీ ఇష్టపూర్వకంగానే చేయాలి కాని, బలవంతంగా కాదని నా అభిప్రాయం.
15
ఇతడు కొంతకాలం నీ నుండి వేరుకావడానికి కారణం, అతడు ఒక బానిసగా కాకుండా, బానిస కంటే ప్రియమైన సహోదరునిగా ఎల్లప్పుడు నీతో పాటు ఉండడానికే కావచ్చును.
16
ఇతడు నాకు చాలా ప్రియమైన వాడు, కాని, సాటి మనిషిగా ప్రభువులో ఒక సహోదరునిగా నీకు కూడా మరింత ప్రియమైన వాడుగా ఉన్నాడు.
17
కాబట్టి నీవు నన్ను ఒక జతపనివానిగా భావిస్తే, నన్ను ఆహ్వానించినట్లే అతన్ని కూడా ఆహ్వానించు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options