ข้ามไปยังเนื้อหา
సంఖ్యాకాండము 24:15-25

సంఖ్యాకాండము 24:15-25

15
అప్పుడు బిలాము ఈ సందేశాన్ని ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,
16
దేవుని మాటలు వినే వాని ప్రవచనం, మహోన్నతుని దగ్గర నుండి తెలివి సంపాదించుకున్నవాడు, సర్వశక్తిగల వాడి నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:
17
“అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు; అతన్ని కనిపెడతాను, కానీ సమీపంగా కాదు. యాకోబు నుండి నక్షత్రం వస్తుంది; ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. అతడు మోయాబు కణతలను నలగ్గొడతాడు, షేతు ప్రజల కపాలాలను చితకగొడతాడు.
18
ఎదోము జయించబడుతుంది; అతని శత్రువైన శేయీరు జయించబడుతుంది. కానీ ఇశ్రాయేలు బలంగా ఎదుగుతుంది.
19
యాకోబు నుండి రాజ్యమేలేవాడు వస్తాడు. అతడు పట్టణంలో మిగిలిన వారిని నాశనం చేస్తాడు.”
20
అప్పుడు బిలాము, అమాలేకును చూసి ఈ సందేశాన్ని ఇచ్చాడు: “అమాలేకు దేశాల్లో మొదటిది, కానీ దాని అంతం పూర్తి నాశనమే!”
21
అతడు కెనీయులను చూసి తన సందేశాన్ని ఇచ్చాడు: “మీ నివాసస్థలం భద్రంగా ఉంది, నీ గూడు బండలో ఉంది;
22
అయినా కెనీయులైన మీరు నాశనమవుతారు అష్షూరు మిమ్మల్ని బందీగా పట్టుకెళ్తుంది.”
23
తర్వాత అతడు తన సందేశాన్ని ఇచ్చాడు: “అయ్యో, దేవుడు ఇలా చేస్తే, ఎవరు జీవించగలరు?
24
కుప్ర తీరం నుండి ఓడలు వస్తాయి; అవి అష్షూరును, ఏబెరును అణచివేస్తాయి, అయితే మీరు కూడా పతనమవుతారు.”
25
తర్వాత బిలాము లేచి తన ఇంటికి వెళ్లాడు, బాలాకు తన దారిన వెళ్లాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options