సంఖ్యాకాండము 24:1-9
1
ఇశ్రాయేలును ఆశీర్వదించడం యెహోవాకు ఇష్టమని బిలాము గ్రహించినప్పుడు, అతడు ఇతర సమయాల్లో చేసినట్టు భవిష్యవాణి ఆశ్రయించలేదు, కానీ తన ముఖాన్ని అరణ్యం వైపు త్రిప్పాడు.
2
ఇశ్రాయేలు వారు గోత్రాల ప్రకారం గుడారాలు వేసుకుని ఉండడం బిలాము చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది,
3
అతడు ఈ సందేశం ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,
4
దేవుని మాటలు వినే వాని ప్రవచనం, సర్వశక్తిగల దేవుని నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:
5
“ఓ యాకోబు, నీ గుడారాలు ఎంత అందంగా ఉన్నాయి, ఓ ఇశ్రాయేలు, నీ నివాస భవనాలు ఎంత రమ్యంగా ఉన్నాయి!
6
“అవి లోయల్లా వ్యాపించాయి, నది ప్రక్కన తోటల్లా ఉన్నాయి, యెహోవా నాటిన అగరు వంటివి, జలాల ప్రక్కన దేవదారు చెట్లలా ఉన్నాయి.
7
వాటి బొక్కెనల నుండి నీళ్లు పారుతున్నాయి; వాటి విత్తనాలకు సమృద్ధిగా నీళ్లుంటాయి. “వారి రాజు అగగు కంటే గొప్పవాడు; వారి రాజ్యం హెచ్చింపబడుతుంది.
8
“దేవుడు ఈజిప్టు నుండి వారిని బయటకు తెచ్చారు; వారు అడవి ఎద్దు బలం కలిగి ఉన్నారు. వారు శత్రు దేశాలను మ్రింగివేస్తారు వారి ఎముకలను తునాతునకలు చేస్తారు; వారి బాణాలతో వారు వారిని గుచ్చుతారు.
9
సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు, వారిని ధైర్యంగా ఎవరు లేపగలరు? “ఓ ఇశ్రాయేలు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక నిన్ను శపించేవారు శపించబడుదురు గాక!”
Settings