Skip to content
నెహెమ్యా 12:12-26

తరువాతి తరపు యాజక నాయకులు

నెహెమ్యా 12:12-26
12
యోయాకీము సమయంలో యాజకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నవారు: శెరాయా కుటుంబానికి మెరాయా; యిర్మీయా కుటుంబానికి హనన్యా;
13
ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము; అమర్యా కుటుంబానికి యెహోహనాను;
14
మెలీకూ కుటుంబానికి యోనాతాను, షెకన్యా కుటుంబానికి యోసేపు;
15
హారీము కుటుంబానికి అద్నా; మెరాయోతు కుటుంబానికి హెల్కయి;
16
ఇద్దో కుటుంబానికి జెకర్యా; గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము;
17
అబీయా కుటుంబానికి జిఖ్రీ; మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి;
18
బిల్గా కుటుంబానికి షమ్మూయ; షెమయా కుటుంబానికి యెహోనాతాను;
19
యోయారీబు కుటుంబానికి మత్తెనై; యెదాయా కుటుంబానికి ఉజ్జీ;
20
సల్లు కుటుంబానికి కల్లయి; ఆమోకు కుటుంబానికి ఏబెరు;
21
హిల్కీయా కుటుంబానికి హషబ్యా; యెదాయా కుటుంబానికి నెతనేలు.
22
ఎల్యాషీబు సమయంలో లేవీయులలో కుటుంబ పెద్దలుగా ఉన్నవారు యోయాదా, యోహానాను, యద్దూవ. పర్షియా రాజైన దర్యావేషు పాలనలో వీరే యాజక కుటుంబాలలో పెద్దలుగా నమోదయ్యారు.
23
ఎల్యాషీబు కుమారుడైన యోహానాను సమయం వరకు కుటుంబ పెద్దలుగా లేవీ వారసుల పేర్లు దినచర్య గ్రంథంలో నమోదు చేయబడ్డాయి.
24
లేవీయుల నాయకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కుమారుడైన యెషూవ, వారి బంధువులు దైవజనుడైన దావీదు నిర్దేశించిన ప్రకారం వంతులవారీగా ఎదురెదురుగా నిలబడి కృతజ్ఞతా స్తుతి గీతాలు పాడడానికి నియమించబడ్డారు.
25
మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనేవారు గుమ్మాల దగ్గర ఉన్న గిడ్డంగులను కాపలా కాసే ద్వారపాలకులు.
26
వీరంతా యోజాదాకు పుట్టిన యెషూవ కుమారుడైన యోయాకీము సమయంలో, అధిపతియైన నెహెమ్యా సమయంలో, ధర్మశాస్త్ర బోధకుడు యాజకుడైన ఎజ్రా సమయంలో సేవ చేశారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.