కంటెంట్‌కు వెళ్లండి
మీకా 6:9-16

సామాజిక అన్యాయానికి తీర్పు

మీకా 6:9-16
9
వినండి! యెహోవా పట్టణానికి ఇలా ప్రకటన చేస్తున్నారు: మీ నామానికి భయపడడమే జ్ఞానం, “శిక్షను, దానిని విధించేవాని మాటలు వినండి.
10
దుర్మార్గపు ఇల్లా, మీ అక్రమ సంపాదనలు, అసహ్యకరమైన మీ తప్పుడు కొలతలు ఇంకా ఉన్నాయి కదా?
11
తప్పుడు త్రాసు, మోసపు తూనిక రాళ్లున్న సంచి కలిగిన వారిని నిర్దోషి అని నేను తీర్పు ఇవ్వాలా?
12
మీ ధనవంతులు దౌర్జన్యం చేస్తున్నారు; మీ నివాసులు అబద్ధికులు వారి నాలుకలు కపటంగా మాట్లాడతాయి.
13
కాబట్టి మీ పాపాల కారణంగా నేను మిమ్మల్ని నాశనం చేసి నిర్మూలిస్తాను.
14
మీరు తింటారు కాని తృప్తి చెందరు; మీ కడుపులు ఇంకా ఖాళీగా ఉంటాయి. మీరు కూడబెట్టుకుంటారు కాని ఏమి కాపాడుకోలేరు, ఎందుకంటే మీరు భద్రపరచుకుంది నేను ఖడ్గానికి అప్పగిస్తాను.
15
మీరు నాటుతారు కాని పంట కోయరు; మీరు ఒలీవపండ్లను త్రొక్కుతారు కాని ఆ నూనెను వాడరు; ద్రాక్షలను త్రొక్కుతారు కాని ద్రాక్షరసం త్రాగరు.
16
మీరు ఒమ్రీ కట్టడాలను పాటించారు అహాబు ఇంటివారి విధానాలన్నీ పాటించారు; వారి సంప్రదాయాలను అనుసరించారు; కాబట్టి నేను మిమ్మల్ని నాశనం చేస్తాను ప్రజలు మిమ్మల్ని అపహాస్యం చేస్తారు; మీరు నా ప్రజల నిందను భరిస్తారు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options