Skip to content
లూకా 21:8-14

లూకా 21:8-14

8
అందుకు ఆయన, “మీరు మోసగించబడకుండ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ ‘సమయం సమీపించింది’ అని చెప్తారు. వారిని అనుసరించవద్దు.
9
మీరు యుద్ధాల గురించి, విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడవద్దు. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం అప్పుడే రాదు.”
10
తర్వాత ఆయన వారితో: “జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి.
11
అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, తెగుళ్ళు వస్తాయి. ఆకాశంలో కూడ భయంకరమైన సంఘటనలు, గొప్ప సూచనలు కనిపిస్తాయి.
12
“ఇవన్నీ జరుగక ముందు, వారు మిమ్మల్ని బలవంతంగా పట్టుకుని హింసిస్తారు. వారు మిమ్మల్ని సమాజమందిరాలకు అప్పగిస్తారు మిమ్మల్ని చెరసాలలో వేస్తారు, నా నామాన్ని బట్టి మీరు రాజుల ఎదుటకు అధికారుల ఎదుటకు కొనిపోబడతారు.
13
మీరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు.
14
అయితే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని ముందుగానే చింతించకుండ ఉండేలా మీ మనస్సును సిద్ధపరచుకోండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options