లేవీయకాండము 11:2-15
2
“ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పండి: ‘భూమి మీద జీవించే జంతువులన్నిటిలో మీరు తినదగిన జంతువులు:
3
చీలిన డెక్కలు కలిగి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.
4
“ ‘కొన్ని కేవలం నెమరువేస్తాయి కొన్ని చీలిన డెక్కలు మాత్రమే కలిగి ఉంటాయి, వాటిని మీరు తినకూడదు. ఒంటెలు నెమరువేస్తాయి కానీ వాటికి చీలిన డెక్కలు లేవు; ఇవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి.
5
అలాగే పొట్టి కుందేలు కూడా నెమరువేస్తుంది కాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది.
6
అలాగే కుందేలు నెమరువేస్తుంది గాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది.
7
పందికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు; ఇది మీకు అపవిత్రమైనది.
8
వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు; అవి మీకు అపవిత్రమైనవి.
9
“ ‘సముద్రాల్లో నదులలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.
10
సముద్రంలో గాని, నదిలో గాని నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోను, నీటి ప్రాణుల్లోను రెక్కలు, పొలుసులు లేనివాటిని మీరు అపవిత్రమైనవిగా చూడాలి.
11
అవి అపవిత్రమైనవి కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు; వాటి కళేబరాలను మీరు అసహ్యించుకోవాలి.
12
రెక్కలు, పొలుసులు లేని జలచరాలేవైనా అపవిత్రమైనవిగా చూడాలి.
13
“ ‘మీకు అపవిత్రమైనవిగా భావించి మీరు తినకూడని పక్షులు ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,
14
ఎర్ర గ్రద్ద, ప్రతి రకమైన నల్ల గ్రద్ద,
15
ప్రతి రకమైన కాకి,
Settings