న్యాయాధిపతులు 18:2-4
2
కాబట్టి దానీయులు తమ వంశాల నుండి అయిదుగురు సమర్థులైన యోధులను ఎన్నుకుని దానీయులందరి తరుపున జోరహు నుండి ఎష్తాయోలు నుండి దేశాన్ని పరిశీలించడానికి పంపి వారితో, “మీరు వెళ్లి దేశాన్ని పరిశీలించి రండి” అని అన్నారు. కాబట్టి వారు ఎఫ్రాయిం కొండసీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చి అక్కడే ఆ రాత్రి గడిపారు.
3
వారు మీకా ఇంటిని సమీపించినప్పుడు, యువకుడైన లేవీయుని స్వరం గుర్తుపట్టి, అతని దగ్గరకు వెళ్లి అతనితో, “నిన్ను ఇక్కడకు ఎవరు తీసుకువచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగారు.
4
అతడు మీకా తనకు చేసిందంతా వారికి చెప్తూ, “అతడు నన్ను జీతానికి పెట్టుకున్నాడు, నేను అతని యాజకుడిని” అని అన్నాడు.
Settings