న్యాయాధిపతులు 17:7-13
7
యూదా ప్రాంతంలోని బేత్లెహేములో యూదా కుటుంబీకులతో నివసిస్తున్న ఒక లేవీ యువకుడు,
8
యూదాలోని బేత్లెహేము పట్టణాన్ని విడిచి, తాను నివసించడానికి స్థలం వెదకడానికి వెళ్లాడు. ఆ పనిమీద వెళ్తూ అతడు ఎఫ్రాయిం కొండ సీమలోని మీకా ఇంటికి వచ్చాడు.
9
మీకా అతన్ని, “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. అతడు, “నేను యూదాలోని బేత్లెహేములో ఉంటున్న లేవీయుడను. నివసించడానికి స్థలం వెదకుతున్నాను” అన్నాడు.
10
అప్పుడు మీకా ఆ లేవీయునితో, “నీవు నాతో నివసిస్తూ, నా తండ్రిగా, యాజకునిగా ఉండిపో. నేను సంవత్సరానికి పది షెకెళ్ళ వెండి, బట్టలు, భోజనం ఇస్తాను” అన్నాడు.
11
కాబట్టి ఆ లేవీయుడు అతనితో ఉండడానికి ఒప్పుకున్నాడు, ఆ యువకుడు తన కుమారులలో ఒకనిగా అయ్యాడు.
12
మీకా ఆ లేవీయున్ని నియమించగా ఆ యువకుడు యాజకునిగా ఉంటూ ఆ ఇంట్లో నివసించాడు.
13
మీకా, “ఈ లేవీయుడు నా యాజకుడయ్యాడు, కాబట్టి ఇప్పుడు యెహోవా నాకు మేలు చేస్తారని నాకు తెలుసు” అన్నాడు.
Settings